
విశాఖపట్నం క్రైం: ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆమె కోరడంతో మట్టుబెట్టాడు. మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి.. రైలులో తీసుకెళ్లి.. ఒడిస్సాలో పడేసాడు. విశాఖలో వెలుగు చూసింది ఈ దారుణ ఘటన. భార్య గర్భిణి కావడంతో.. ఆమెకు సహాయకురాలిగా వచ్చిన యువతి తోనే దుకాణం పెట్టాడు. భార్య పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఆమె పెళ్లి చేసుకోమని కోరడంతో ఈ విధంగా మరణ శాసనం రాసేశాడు. ఎందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
* విశాఖలో ఘటన..
విశాఖపట్నం కంచరపాలెం దుర్గా నగర్ కు చెందిన బొలిశెట్టి సురేష్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గర్భిణి కావడంతో ఆమెకు సహాయంగా ఉండేందుకు తనకు పరిచయం అయిన యువతిని ఇంటికి రప్పించుకున్నాడు. ఆమె కూడా ఆ దంపతులతో కలిసి ఉండేది. ఈ వ్యక్తి యువతీతో సురేష్ వివాహేతర బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.. ఇటీవల సురేష్ భార్య పుట్టింటికి వెళ్ళింది. సదరు యువతీ తనను పెళ్లి చేసుకోవాలని సురేష్ పై తీవ్ర ఒత్తిడి చేసింది. ఈ విధంగానే ఇద్దరి మధ్య వాదన జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సురేష్ యువతిని గోడకేసి బాదేశాడు. తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. కొద్దిసేపటికే చనిపోయింది.
* ఒడిస్సా లో పడేశాడు..
అయితే ఈ విషయం తెలిస్తే తనకు ఇబ్బంది అని భావించి ప్రత్యేక ప్రణాళిక వేశాడు. ఆ యువతి మృతదేహాన్ని ఓ సూట్ కేసులో పెట్టి.. విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఒడిస్సా వైపు వెళ్లే రైలు ఎక్కాడు. అలా రాయగడ జిల్లా చాందిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి తిరిగి వచ్చేసాడు. అయితే అక్కడి స్థానికులకు ఆ సూట్ కేసు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు అన్ని కోణాల్లో విచారణకు చేరుకున్న పోలీసులు. ఈ మృతదేహం ఆనవాళ్లు విశాఖలో ఉండడంతో ఇక్కడికి వచ్చి దర్యాప్తు కోసం. ఈ విషయాన్ని సురేష్ కుటుంబంతో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు అసలు తప్పును ఒప్పుకున్నాడు. అయితే ఒక రాష్ట్రంలో చంపి.. మరో రాష్ట్రంలో పడేస్తే ఎవరూ పట్టుకోలేరని భావించాడు. కానీ ఒడిస్సా పోలీసులు మాత్రం వెంటాడి వేటాడి మరి అదుపులోకి తీసుకోవడం విశేషం.