AE Nookaraju Family Suicide Case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య. మత మార్పిడి వేధింపులు వల్లే ఆ కుటుంబం అఘాయిత్యానికి కారణమైంది.. దానికి కారణమైన సాధిక్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆయన చర్యలను ముస్లింలు సైతం ఖండిస్తున్నారు. మరల ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది. అయితే […]
AE Nookaraju Family Suicide Case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య. మత మార్పిడి వేధింపులు వల్లే ఆ కుటుంబం అఘాయిత్యానికి కారణమైంది.. దానికి కారణమైన సాధిక్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆయన చర్యలను ముస్లింలు సైతం ఖండిస్తున్నారు. మరల ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది. అయితే ఈ కేసులో ఊహించని మలుపు. సాధిక్ తల్లి నూర్జహాన్ తొలిసారిగా మీడియం ముందుకు వచ్చి మాట్లాడారు . నూకరాజు కుటుంబం తన కుమారుడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఇది నిజం కాదని.. తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని సౌజన్య కోరింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ కేసులో ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.
* కీలక అంశాలు వెల్లడి..
నూర్జహాన్ మీడియా ముందుకు వచ్చి కీలక అంశాలు. సౌజన్య తన ఇంటికి రెండుసార్లు వచ్చిందని.. సాదిక్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పానని.. ఆ ప్రతిపాదనను తాము నిరాకరించిన ప్రతిపాదనను కూడా తేల్చేశారు. మరోవైపు జగదీశ్వర్ రెడ్డితో ఆమెకు పెళ్లి జరిగి ఉండకపోతే సాదిక్ కే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే వాడిని ఆమె తండ్రి నూకరాజు స్వయంగా తమతో చెప్పినట్లు నూర్జహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌజన్య భర్త మృతితో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఫోన్ చేయడంతోనే సాదిక్ వెళ్లాడని.. అప్పట్లో జగదీశ్వర్ రెడ్డితో పాటు అతని మనుషులు తన కొడుకుపై దాడి చేశారు.. కత్తి చూపించి బెదిరించారని నూర్జహాన్. భర్త జగదీశ్వర్ రెడ్డి సరిగ్గా చూసుకోక పోవడం వల్లే తన కుమారుడితో సౌజన్య సంబంధం పెట్టుకుందని ఆమె.
* ఆరోపణల్లో నిజం లేదు..
బలవంతంగా మతమార్పిడి విషయంలో కూడా తన కుమారుడి ప్రమేయం లేదు అంటూ తేల్చి చెప్పారు నూర్జహాన్. తెలుగు ఖురాన్, బురఖా కావాలని సౌజన్య తమను అడిగినట్లు కూడా చెప్పారు. వారు ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం 5:30 గంటలకు సౌజన్య ఫోన్ చేసి రమ్మని పిలిచారని.. సాత్విక్ స్థానికంగా లేడని చెప్పారు. నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తులు కానీ.. బంగారం కానీ తమ వద్ద లేవని.. తమ బ్యాంకు పాస్ బుక్‌లు, ఆధార్ కార్డులను పోలీసులకు అప్పగించినట్లు వివరించారు. నూర్జహాన్ చెప్పిన అంశాలతో.. ఈ కేసులో కొత్త ట్విస్ట్. మున్మందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.