Home Uncategorizedమాయదారి ప్రేమ కోసం తల్లిదండ్రులను.. చివరికి ఈమె జీవితం.. – Jananethram News

మాయదారి ప్రేమ కోసం తల్లిదండ్రులను.. చివరికి ఈమె జీవితం.. – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


సుర్ఖా కేసు: వయసు వేడిలో చాలామంది యువత తప్పులు చేస్తున్నారు. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఘోరమైన పనులకు గురవుతున్నారు. చివరికి వారిలో పశ్చాత్తాపం సంభవించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈమె జీవితం కూడా అలాంటిదే. చేసిన తప్పు మాములుది కాదు. సభ్య సమాజం ఈమె చేసిన దారుణాన్ని చూసి తలదించుకుంది. చివరికి ఏమైందో తెలియదు.. ఆమెలో ఎటువంటి బాధ ఆవహించిందో అర్థం కాలేదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తూ ఉండేది సురేఖ […]

సుర్ఖా కేసు: వయసు వేడిలో చాలామంది యువత తప్పులు చేస్తున్నారు. దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఘోరమైన పనులకు గురవుతున్నారు. చివరికి వారిలో పశ్చాత్తాపం సంభవించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈమె జీవితం కూడా అలాంటిదే. చేసిన తప్పు మాములుది కాదు. సభ్య సమాజం ఈమె చేసిన దారుణాన్ని చూసి తలదించుకుంది. చివరికి ఏమైందో తెలియదు.. ఆమెలో ఎటువంటి బాధ ఆవహించిందో అర్థం కాలేదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకుంది.

సంగారెడ్డిలో నర్సుగా యువత పనిచేస్తూ ఉండేది సురేఖ అనే. ఈమెకు 25 సంవత్సరాలు. కుటుంబం పరంగా ఆర్థిక సమస్యలు లేవు. ఈమెకు ఒక సోదరుడు ఉన్నారు. ఈ కోరిక సురేఖ ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించడం మొదలుపెట్టింది. అతనితోనే వివాహం జరిపించాలని కోరింది. దానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొద్దిరోజులు వారితో సురేఖ మాట్లాడలేదు. ఆ తర్వాత తన ప్రియుడి గురించి వారితో చర్చించడం మొదలుపెట్టింది. అయినప్పటికీ అతడితో పెళ్లికి వారు ఒప్పుకోలేదు. దీంతో సురేఖ వారి మీద ఆగ్రహం పెంచుకుంది. ప్రతిసారి తనను ఇబ్బంది పెడుతున్నప్పుడు వారిని అంతం చేయాలని భావించింది.

సరిగ్గా ఏడు క్రితం ఇంటికి వెళ్లిన సురేఖ.. తల్లిదండ్రులకు మత్తుమందు ఇచ్చింది. ఆ మత్తులోనే వారిద్దరు చనిపోయారు. ఆ తర్వాత వారిద్దరికీ గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. మహానటి లెవెల్లో ఫెర్ఫార్మన్స్ ఇచ్చింది. కానీ.. ఆమె మాట్లాడిన మాటలకు.. చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ప్రేమికుడితో పెళ్లి జరిపించలేదని ఆగ్రహంతో ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. గడిచిన ఏడు నెలలుగా ఆమె జైలు శిక్ష అనుభవించింది. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో ఆమె ఒక హాస్టల్లో ఉంటోంది. తన పేరెంట్స్ ను ఏ విధంగా మత్తుమందు ఇచ్చి అంతం చేసిందో.. అదే తీరుగా ఆమె కూడా మత్తుమందు తనకు తాను ఇచ్చుకుని.. బలవన్మరణానికి పాల్పడింది. సురేఖ వ్యవహారం ఎంతోమందికి గుణపాఠం లాగా మారింది.

వయసు వేడిలో కన్న తల్లిదండ్రులనే ఆమె మర్చిపోయింది. మాయదారి ప్రేమ కోసం ఏకంగా వారినే అంతం చేసింది. చివరికి తన ప్రాణాలు తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఒక కుటుంబం మొత్తం తీరని దుఃఖంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు చనిపోయి.. సోదరి కూడా ఇలా కనుమూయడంతో సురేఖ సోదరుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇంతటి ఘోరం ఏ కుటుంబానికి రాకూడదని అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

22 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago