Home జాతీయఆపరేషన్‌ సిందూర్‌.. పాకిస్థాన్‌పై భారత్‌ వ్యూహాత్మక విజయం! – RMK NEWS

ఆపరేషన్‌ సిందూర్‌.. పాకిస్థాన్‌పై భారత్‌ వ్యూహాత్మక విజయం! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

ఆపరేషన్ సిండోర్: యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కూడా భారత్‌ అహంకారంతో వ్యవహరించడం లేదు. చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ మాత్రం తామే గెలిచామని ప్రచారం చేసుకుంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో త్రివిధ సైనిక అధిపతిగా ఉన్న జనరల్‌ చౌహాన్‌ ఇటీవల డిస్కవరీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెలిచిన అహంకారం ఎక్కడా ప్రదర్శించబడలేదు. పాకిస్థాన్‌పై సాధించిన వ్యూహాత్మక ఆధిక్యాన్ని నిర్మొహమాటంగా వివరించారు. ఈ మాటలు కేవలం విజయాన్ని కాకుండా, భారత పరిణతి చెందిన వ్యూహాన్ని కూడా […]

ఆపరేషన్ సిండోర్: యుద్ధంలో విజయం సాధించిన తర్వాత కూడా భారత్‌ అహంకారంతో వ్యవహరించడం లేదు. చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ మాత్రం తామే గెలిచామని ప్రచారం చేసుకుంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో త్రివిధ సైనిక అధిపతిగా ఉన్న జనరల్‌ చౌహాన్‌ ఇటీవల డిస్కవరీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గెలిచిన అహంకారం ఎక్కడా ప్రదర్శించబడలేదు. పాకిస్థాన్‌పై సాధించిన వ్యూహాత్మక ఆధిక్యాన్ని నిర్మొహమాటంగా వివరించారు. ఈ మాటలు కేవలం సైనిక విజయాన్ని కాకుండా, భారత పరిణతి చెందిన వ్యూహాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.

పాక్ వ్యూహాలు విఫలం..
చౌహాన్ ప్రకారం, భారత్ వ్యూహం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. పాక్ సైన్యం భారత్‌ ప్రణాళికలను పసిగట్టడంలో, అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. వారి దగ్గర ప్రొఫెషనలిజం కూడా కరువైందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో అవాక్స్‌ వంటి రాడార్‌ వ్యవస్థలు, చైనా సరఫరా చేసిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌లు రక్షణ, భారత్‌ వాటిని కన్నుగప్పి నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయగలిగింది. ఇది పాక్ నిఘా, రక్షణ వ్యవస్థల బలహీనతను బహిర్గతం చేసింది.

నాలుగు అంచెల ఎయిర్ డిఫెన్స్..
పాకిస్తాన్ ప్రతిస్పందనగా యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది. కానీ భారత్‌ ఆకాశ్, ఎస్‌–400 వంటి నాలుగు అంచెల ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను మోహరించి ఒక్క డ్రోన్‌ కూడా భారత భూభాగంలోకి ప్రవేశించకుండా చేసింది. ఈ రక్షణ గోడ చూసి పాకిస్తాన్ బిత్తరిపోయింది. వారు కోలుకునే లోపే భారత వైమానిక దళం పాక్ లోపలికి వెళ్లి ఎయిర్‌బేస్‌లపై కచ్చితమైన దాడులు చేసింది. ఇవి పాకిస్తాన్ ఊహించని ఎత్తుగడలు. ఒకవైపు రక్షణ, ఎదురు దాడి ఈ ద్వంద్వ వ్యూహం పాక్‌ను పూర్తిగా అసమతుల్యం చేసింది.

బుద్ధి చెప్పే చర్యగా..
భారత్‌కు యుద్ధం చేయాలన్న కాంక్ష లేదని చౌహాన్‌ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. తమ దేశంలో ఉగ్రదాడి జరిగినందున బుద్ధి చెప్పడానికే ఈ చర్యలు తీసుకున్నామని వివరించారు. పాకిస్తాన్‌ చివరకు అమెరికా, గల్ఫ్‌ దేశాలను శరణు కోరి యుద్ధం ఆపాలని వేడుకుంది. భారత్ డీఏఈ, అమెరికాకు స్పష్టం చేసింది.. పాక్‌ డీజీఎంవో భారత్‌ జీఎంవోతో మాట్లాడాలి, అప్పుడే దాడులు ఆగుతాయి. ఇది కేవలం సైనిక విజయం కాదు, దౌత్యపరమైన, వ్యూహాత్మక ఆధిక్యం కూడా.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌ సైనిక సామర్థ్యం, ​​ప్రణాళికా నైపుణ్యం, సంయమనాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్ అంచనాలు తప్పిపోయాయి. వారి రక్షణ వ్యవస్థలు సరిపోలేదు. భారత్ అహంకారం లేకుండా, లక్ష్యబద్ధంగా వ్యవహరించింది. ఇది భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక నమూనాగా నిలుస్తుంది. విజయం సాధించిన తర్వాత కూడా ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగడమే నిజమైన బలం అని ఈ ఆపరేషన్ నిరూపించింది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

20 hours ago
Good Morning

Good Morning

23 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago