ఫహద్ ఫాజిల్: ఫహద్ ఫాజిల్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు.. పుష్ప సినిమా ద్వారా శకావత్ పాత్రతో ఈయన మెరిశాడు.. ఆ తర్వాత ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ముఖ్యంగా విక్రమ్ సినిమాలో అండర్ కాప్ పాత్రలో ఈయన జీవించాడు. కళ్ళతో అత్యంత సులభంగా హవ భావాలు ప్రదర్శించే నటుడిగా ఇతనికి పేరు వచ్చింది.. తాజాగా ఇతడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో.. రాజమౌళి మేనల్లుడు […]
ఫహద్ ఫాజిల్: ఫహద్ ఫాజిల్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు.. పుష్ప సినిమా ద్వారా శకావత్ పాత్రతో ఈయన మెరిశాడు.. ఆ తర్వాత ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. ముఖ్యంగా విక్రమ్ సినిమాలో అండర్ కాప్ పాత్రలో ఈయన జీవించాడు. కళ్ళతో అత్యంత సులభంగా హవ భావాలు ప్రదర్శించే నటుడిగా ఇతనికి పేరు వచ్చింది.. తాజాగా ఇతడు రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో.. రాజమౌళి మేనల్లుడు ఏలేటి శశాంక్ దర్శకత్వంలో ఫహద్పాత్రలో నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఫహద్ కీలకమైన విషయాలు వెల్లడించాడు. మైక్ అందుకోగానే జై ఎన్టీఆర్ అని నినాదాలు చేశాడు. ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. అశేషమైన ప్రేక్షకులను, అభిమానులను ఉద్దేశించి ఫహద్ మాట్లాడాడు. తనకు ఈ స్థాయిలో అభిమాన గణం ఏర్పడేందుకు ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొనియాడారు.
నిద్ర లేని రాత్రులు
ఈ సినిమా షూటింగ్ కోసం ఫహద్ హైదరాబాద్ వచ్చారు. ఆయన గురించి తారక ఎంతగానో పేరు తీసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటికి తీసుకెళ్లారు. దాదాపు రాత్రి మూడు గంటల వరకు ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో తనకు అద్భుతమైన అనుబంధం ఉందని.. అదే నిద్ర లేని రాత్రులకు కారణమైందని ఫహద్ తన అనుభవాన్ని చెప్పుకున్నాడు. ఈ సినిమా షూటింగ్.. ఇతర ప్రాజెక్టుల వల్ల కొద్ది రోజులుగా తన భార్యకు దూరంగా ఉంటున్నారని.. ఆయన అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ చూపించిన ఆప్యాయత ఆ లోటు తెలియకుండా చేసిందని ఫహద్ వ్యాఖ్యానించాడు.
ఇక ఈ సినిమాలో ఫహద్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. అంతేకాదు తనకు స్వాతిముత్యం.. అంతపురం సినిమాలు అత్యంత ఇష్టమని పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు తాను రాసిన లవ్ లెటర్ అని అతడు ఒకడు. వచ్చేనెల 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ థియేటర్లలో చూసి ఆనందించాలని ఫహద్ నింపాడు. అతడు మాట్లాడుతున్నంతసేపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేరింతలు కొట్టడం విశేషం.
ఇక ఈ చిత్రానికి కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. రాజమౌళి మేనల్లుడు శశాంక్ దర్శకత్వం వహించాడు. అందువల్లే ఈ రాజమౌళి కుటుంబం ముందుండి ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాల్లో రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఒకరు. ఈ సినిమా ప్రమోషన్ భారీగా జరుగుతున్న నేపథ్యంలో.. మార్కెటింగ్ కూడా అదే స్థాయిలో ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఫహద్ మంచి నటుడు.. పైగా అతనికి తెలుగులో బ్రహ్మాండమైన మార్కెట్ ఉన్న నేపథ్యంలో.. భారీ వసూళ్లు సాధ్యమవుతున్న ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
నేను ఈ రకమైన యుఫోరియాను ఎప్పుడూ చూడలేదు. దీనికి కారణం #ఎన్టీఆర్
జై ఎన్టీఆర్. . జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్
– #DontTroubleTheTrouble ప్రీ రిలీజ్లో #ఎన్టీఆర్కి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన #ఫహద్ ఫాసిల్
— (@BheeshmaTalks) సెప్టెంబర్ 29, 2026