Home జాతీయIndia China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన నిజం – RMK NEWS

India China Russia : రష్యాకు జైశంకర్, చైనాకు అజిత్ ధోవల్.. ఎందుకు వెళ్లారంటే..వెలుగులోకి సంచలన నిజం – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

India China Russia : ఇండియా అంటే చాలు చైనా తన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మన సరిహద్దులను ఆక్రమిస్తూ ఉంటుంది. మన దేశ సైనికుల మీద నిబంధనలు అతిక్రమించి దాడులకు ఉసిగొలుపుతూ ఉంటుంది.. అటువంటి చైనా ఒక్కసారిగా మన మాట విని తన ఆర్మీని వెనక్కి తీసుకుంది.

చైనా దేశంలో ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను అక్కడి ప్రభుత్వం తొలగించింది. దీని వెనక భౌగోళికమైన రాజకీయ కారణాలు ఉన్నాయి. చైనా దేశంలో అత్యున్నత సైనిక కమాండ్ బాడీ అయిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ నుంచి గ్యాంగ్ యుగాజియా.. లియో జనీల్ అనే ఇద్దరు సీనియర్ జనరల్స్ ను తొలగించారు. చైనాలో కొంతమంది అవినీతిపరులైన అధికారులు అమెరికా ప్రేరేపిత కుట్రలో భాగంగా భారత్, చైనా, భారత్ పాకిస్తాన్ మధ్య విభేదాలను సృష్టించాలని ప్రయత్నించారు. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్ వంటి అంతర్జాతీయ సంక్షోభాల నుంచి ప్రపంచదృష్టిని మళ్లించడానికి ఈ ప్రయత్నం జరిగింది.. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన భారత్ వెంటనే అప్రమత్తమైంది.. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో.. భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ రష్యాలో పాల్గొన్నారు. మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను పకడ్బందీ ఆధారాలతో ఆయా దేశాల నాయకత్వాలకు వివరించారు. దీనివల్ల చైనా వాస్తవ తెలుసుకుని.. సైనిక అధికారులను విధుల నుంచి తొలగించింది. చైనా అధ్యక్షుడు తన సొంత మార్గాల ద్వారా ఈ విషయాలను దృవీకరించుకున్నారు. ఆ తర్వాత ఆ అధికారులను తొలగించారు.. అంతేకాదు భారత సరిహద్దుల్లో మోహరించిన చైనా ఆర్మీని వెనక్కి పంపారు.

కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లో చైనా తన ఆర్మీని మోహరించింది. వారి కదలికలను పెంచింది. ఇది మన దేశ ప్రభుత్వానికి ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి గాల్వన్ లోయలో జరిగిన ఘటన తర్వాత భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. అలాగాని చైనాతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం లేదు. అయితే చైనా గెలికి వాసన చూసే రకం. పైగా కొంతమంది అవినీతిపరులైన అధికారులు ఆ దేశ ఆర్మీలో ఉన్నారు. ఇది మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందని గుర్తించి లోతుగా తవ్వడం మొదలుపెట్టింది. దీని వెనక అమెరికా అమెరికా ఉన్నట్టు గుర్తించి.. ఈ విషయాలను చైనా.. ఇతర దేశాల దృష్టికి తీసుకెళ్ళింది. దీనితో అమెరికా అసలు రంగు బయటపడింది. మరి అమెరికా ఏవిధంగా చర్యలు తీసుకుంటుంది.. అమెరికా ప్రభుత్వ పెద్దలతోనే జరిగిందా.. లేకుంటే ఎవరైనా అధికారుల అత్యుత్సాహం వల్ల జరిగిందా అనేది విచారణలో తేలిందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ చైనాతో జరగబోయే ముప్పును ముందుగానే ఊహించిన భారత్.. దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించింది. చివరికి అమెరికా కంటిని అమెరికా చేతితోనే పొడిపించింది. అంతేకాదు సరిహద్దుల్లో భారీగా మోహరించిన చైనా సైనికులను చైనా ప్రభుత్వమే వెనక్కి పంపించే విధంగా చేసింది. మొత్తానికి భారత్ తనకు ఎదురు కాబోతున్న ముప్పును అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

24 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

2 days ago