Home Uncategorizedరాజ్ కుమార్: కన్నవారు కాదన్నారు.. పోస్టుమార్టం వద్దన్నారు.. అనాథశవంలా రాజ్ కుమార్ అంత్యక్రియలు.. వీడియో –

రాజ్ కుమార్: కన్నవారు కాదన్నారు.. పోస్టుమార్టం వద్దన్నారు.. అనాథశవంలా రాజ్ కుమార్ అంత్యక్రియలు.. వీడియో –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

రాజ్ కుమార్

రాజ్ కుమార్: ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. పదునైన కత్తులతో సై*కో లాంటి వీరంగం చేశాడు. అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.. రాక్షసుడి వలె వ్యవహరించాడు. నమ్మి వచ్చిన భార్యను.. కన్న కొడుకులను అత్యంత దారుణంగా హతమార్చాడు. బాలికను.. ఆమె తల్లి.. నానమ్మను పైశాచికంగా చంపేశాడు. ఇంతటి క్రూరానికి చేసిన ఆ దుర్మార్గుడు చివరికి కుక్క చావు చచ్చాడు. గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాల గూడ ప్రాంతంలో సై*కో కి*ల్లర్ రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. కేవలం స్వల్ప కాలంలోనే అతడు ఆరుగురిని చంపేశాడు. ఆ తర్వాత పరారీ అయ్యాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత విరమించుకున్నాడు. పోలీసులు ఒత్తిడి తీసుకురావడం.. గాలింపు ముమ్మరం చేయడంతో తట్టుకోలేకపోయాడు. తనమీద పాజిటివ్ ఒపీనియన్ కోసం సూ*సై*డ్ లెటర్ కూడా రాశాడు. ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత గడ్డి మందు తాగి.. తన మేనమా ఊరిలో పొలాల దగ్గర చనిపోయాడు.

రాజ్ కుమార్ మరణించాడని స్థానికులు డయల్ 100 కు ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకొని అతడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని స్వీకరించడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మృతదేహం అంబులెన్స్ లో ఉండగా.. చూసి వెను తిరిగి వెళ్లిపోయారు. చేవెళ్ల పురపాలక సిబ్బంది సహకారంతో స్థానికంగా ఉన్న స్మశాన వాటికలో రాజ్ కుమార్ మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.

రాజ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంలో దాదాపు మూడు గంటల వరకు జాప్యం ఏర్పడింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ పోస్టుమార్టం చేయడానికి ముందుకు రాలేదు. దీంతో వికారాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి వైద్యులను రప్పించేందుకు ప్రయత్నించారు. అవి విఫలం కావడంతో.. చివరికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి.. డాక్టర్ ప్రణీత్ వచ్చి పోస్టుమార్టం పూర్తి చేశారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

2 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago