Home UncategorizedRaj Kumar Case: సై*కో రాజ్ కుమార్ నుంచి ఆ రెండు కుటుంబాల్లో తప్పించుకున్న ఒకే ఒక అమ్మాయి.. ఎలాగంటే –

Raj Kumar Case: సై*కో రాజ్ కుమార్ నుంచి ఆ రెండు కుటుంబాల్లో తప్పించుకున్న ఒకే ఒక అమ్మాయి.. ఎలాగంటే –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం మామూలుది కాదు. ఏకంగా ఆరుగురుని అతడు పొట్టన పెట్టుకున్నాడు. అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపాడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. ఇతర ప్రాంతాలలో తలదాచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు. రాజ్ కుమార్ సృష్టించిన హత్యకాండ వల్ల రెండు కుటుంబాల్లో ఒకే ఒక అమ్మాయి […]

Raj Kumar Case: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో రాజ్ కుమార్ సృష్టించిన నరమేధం మామూలుది కాదు. ఏకంగా ఆరుగురుని అతడు పొట్టన పెట్టుకున్నాడు. అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి చంపాడు. ఆ తర్వాత అతడు పారిపోయాడు. ఇతర ప్రాంతాలలో తలదాచుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు పోలీసులు.

రాజ్ కుమార్ సృష్టించిన హత్యకాండ వల్ల రెండు కుటుంబాల్లో ఒకే ఒక్క అమ్మాయి మిగిలింది. ఆ బాలిక కుటుంబంలో ఇప్పటికే రాజ్ కుమార్ నలుగురిని చంపేశాడు. ముందుగా ఆ బాలిక తండ్రిని చంపేశాడు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత బాలిక మీద దారుణానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలిక ఎదురు తిరిగింది. నాడు ఆ బాలిక తల్లి ధైర్యం చేసి అతడి నుంచి తన బిడ్డను కాపాడుకుంది. ఆ తర్వాత వారు రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో కింద కేసు పెట్టారు.

పోలీసులు అతడి దగ్గరనుంచి డబ్బులు తీసుకుని బలహీనమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో రాజ్ కుమార్ సులభంగానే బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులపాటు నిశ్శబ్దంగానే ఉన్నాడు. అనంతరం గడచిన శనివారం తెల్లవారుజామున దైవాలగూడ ప్రాంతంలో నరమేధానికి హాజరయ్యారు. ఏకంగా ఆరుగురుని చంపేశాడు. ఆ బాలిక కుటుంబం మీద కక్ష కట్టిన రాజ్ కుమార్.. బాలికను.. బాలిక తల్లిని.. ఆమె కుటుంబంలో మరో మహిళను చంపేశాడు. తన భార్య పిల్లల్ని కూడా కడతేర్చాడు. చివరికి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజ్ కుమార్ చంపిన బాలికకు ఒక అక్క ఉంది. ఆ దుర్మార్గుడి క్రూరత్వం వల్ల ఆమె మాత్రమే మిగిలిపోయింది. ఆ బాలిక మానసిక అక్క దివ్యాంగురాలు. దీంతో ప్రభుత్వం ఆమెకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మిస్తామని చెప్పింది. మరోవైపు రాజ్ కుమార్ మృతహస్తానికి పోస్టుమార్టం వైద్యులు కూడా ముందుకు రాలేదు. అనేక ప్రయత్నాల తర్వాత వైద్యులు రావడంతో పోస్టుమార్టం పూర్తయింది. ఆ తర్వాత అతడి అంత్యక్రియలు సంబంధిత కుటుంబ సభ్యుల ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆ పని పూర్తి చేశారు.

రాజ్ కుమార్ ఆ బాలిక ఇంటికి వెళ్ళినప్పుడు.. దారుణంగా ప్రవర్తించాడు. నేరుగా ఇంట్లోకి వెళ్లి ఆ బాలికను బయటికి తీసుకొచ్చాడు. అయితే ఆ బాలిక తల్లి.. ఆమె నానమ్మ అడ్డుకున్నారు. దీంతో చేతిలో ఉన్న కత్తితో వారిద్దరిని పొడిచి చంపేశాడు. ఆ సమయంలో మానసిక దివ్యంగురాలైన ఆ బాలిక అక్క ఇంట్లోనే వేరే గదిలో ఉంది. కాకపోతే ఆమె జోలికి రాజ్ కుమార్ వెళ్లలేదు. అందువల్లే బతికిపోయింది. ఆ బాలికను బయటికి తీసుకొచ్చి.. కారులో చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మీద అత్యాచారం చేశాడు. ఆ తర్వాత దారుణంగా చంపేశాడు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

2 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago