Home జాతీయనేపాల్ ను ముంచెత్తిన వరదలు.. భారత్ కు డేంజర్ సిగ్నల్.. – RMK NEWS

నేపాల్ ను ముంచెత్తిన వరదలు.. భారత్ కు డేంజర్ సిగ్నల్.. – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

నేపాల్ వరదలు : ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది.. యూరప్ నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు తీవ్రమైన కరువు. ఎన్నడులను ఈ స్థాయిలో చూడలేదని యూరప్ వాసులు అంటున్నారు. అక్కడ హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. వేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రపంచంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన […]

నేపాల్ వరదలు : ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది.. యూరప్ నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు తీవ్రమైన కరువు. ఎన్నడులను ఈ స్థాయిలో చూడలేదని యూరప్ వాసులు అంటున్నారు. అక్కడ హీట్ వేవ్ తీవ్రంగా ఉంది. వేడికి తట్టుకోలేక అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

సముద్రంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల ప్రపంచంలో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు ఉంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న నేపాల్ దేశంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాలయాలకు సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో వర్షాలు రికార్డు స్థాయిలో కురుస్తున్నాయి. టిబెట్ నుంచి నేపాల్ దేశానికి విపరీతంగా వరదలు వస్తున్నాయి. ముఖ్యంగా నేపాల్ దేశంలోని బోటే కోసి నదిలోకి భారీగా వరద ప్రవాహం వచ్చింది. దీంతో త్రిశూలి పరివాహక ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. బోటే కోసి నది నుంచి ప్రవాహం ఆదినారాయణి , నది మీదుగా బీహార్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ప్రవాహం గంగా నదిలో కలిస్తే అప్పుడు బీహార్ రాష్ట్రం తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటుంది.

గంగా నది ప్రవాహం పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, గోపాల్‌గంజ్, సారన్, వైశాలి ప్రాంతాల్లో తీవ్రంగా నష్టాన్ని కలగజేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో.. హిమాలయ నది పరివాహక ప్రాంతాలలో విపరీతంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా అస్సాం రాష్ట్రం చాలా రోజులపాటు వరదలలో చిక్కుకుపోయింది.. ఇక మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. ఈ వర్షాల నుంచి ఇంకా ఈశాన్య రాష్ట్రాలు.. హిమాలయాల పరిధిలో ఉన్న రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. కాకపోతే మిగిలిన రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో మనదేశంలో భిన్నమైన వాతావరణం ఈసారి ఏర్పడింది. అయితే నేపాల్ దేశంలో విపరీతంగా వరదలు వస్తున్న నేపథ్యంలో.. భారతదేశంలో ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోని రాష్ట్రాలు.. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి. ఎందుకంటే గంగానది మనదేశంలో హిమాలయ పరిధిలో ఉన్న రాష్ట్రాలలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ప్రవాహం తీవ్రంగా ఉంటే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

గంగా నది మనదేశంలో ఉదృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీని ప్రవాహ తాకిడికి గతంలో మన దేశంలో అనేక రాష్ట్రాలలో నష్టం విపరీతంగా జరిగింది. గంగా నది ప్రవహించే రాష్ట్రాలు మనదేశంలో అధికంగా ఉన్నాయి. పైగా వర్షాకాలంలో గంగానదికి ప్రవాహం విపరీతంగా వస్తూ ఉంటుంది. హిమాలయ పరివాహక ప్రాంతాల్లో వర్షం కురిసినా సరే గంగా నది విస్తారంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఆ నది ప్రవహించే రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు వెలువడుతున్నాయి

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
పాకిస్థాన్‌ భయపడుతోంది.. భారత్‌ జోలికొస్తే.. - OkTelugu - RMK NEWS

India Pakistan Tensions: ఉద్యమాలను ప్రారంభించడం సులభం. కానీ వాటిని నియంత్రించడం లేదా అంతం చేయడం కష్టం. ఆ…

Just now
Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా - RMK NEWS

బొత్స సత్యనారాయణ : విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా…

Just now
India Defense Sector: ఇండియన్ డిఫెన్స్ లోకి ప్రైవేట్ కంపెనీలు.. మోడీ టార్గెట్ ఏంటి.. - RMK NEWS

భారతదేశ రక్షణ రంగం: మనదేశంలో ప్రైవేట్ వ్యవస్థ అన్ని రంగాలకు విస్తరించింది. ఇంతవరకు ప్రైవేట్ రంగం తొంగి చూడని…

Just now
YS Jagan: 2034 నాటికి వైసిపి బంగాళాఖాతంలోకి.. ఎందుకిలా.. - RMK NEWS

YS Jagan: 2019 ఎన్నికల్లో భారీగా స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చింది వైసిపి. ఆ తర్వాత ఇంకా కొన్ని…

Just now
ట్రంప్ ఇరాన్ యుద్ధం : నిండా మునిగిన ఓ 'ట్రంప్' కథ -RMK NEWS

ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు ఏం దక్కింది? ట్రంప్ వ్యూహం ఎందుకు బెడిసికొట్టింది? పశ్చిమాసియాలో మారుతున్న సమీకరణాల వెనుక అసలు…

Just now