Home ఆంధ్రప్రదేశ్Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా – RMK NEWS

Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బొత్స సత్యనారాయణ : విజయనగరం జిల్లా వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వరుస సమావేశాల్లో భావోద్వేగానికి లోనవుతున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయనకు అత్యంత సన్నిహితుడైన మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మజ్జి శ్రీను పార్టీ మారిన తర్వాత చీపురుపల్లి, విజయనగరం వైసీపీ తదితర ప్రాంతాల్లో బొత్స ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను సమీకరించి పార్టీకి అండగా నిలవాలని, కష్టకాలంలో వెనక్కి తగ్గకుండా కలిసికట్టుగా పనిచేయాలని బొత్స పిలుపునిస్తున్నారు. అయితే సమావేశాల్లో మజ్జి శ్రీనుతోన్న అనుబంధాన్ని కార్యకర్తలు, నేతలు గుర్తుచేసుకునే వాతావరణం ఒక్కసారిగా భావోద్వేగంగా మారుతోంది.

బొత్స కంటతడి.. కార్యకర్తల ఓదార్పు

చీపురుపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో మజ్జి శ్రీతో కలిసి పనిచేసిన రోజులను పలువురు నేతలు, కార్యకర్తలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. దీంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ తర్వాత జరిగిన విజయనగరం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలోనూ బొత్స మరోసారి భావోద్వేగానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో వరుస సమావేశాల్లో బొత్సను కార్యకర్తలు సముదాయించాల్సిన పరిస్థితి కనిపిస్తోందనే చర్చ మొదలైంది.

‘ఎవరు ఎవరికి ధైర్యం చెబుతున్నారు?’

ఇక్కడే అసలు ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. సమావేశాల్లో బొత్స కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. “వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం, వెళ్లడం సహజం.. పార్టీ మాత్రం శాశ్వతం” అంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ అదే సమయంలో బొత్స భావోద్వేగానికి గురైనప్పుడు కార్యకర్తలు, నాయకులే ఆయనను ఓదార్చాల్సి వస్తోంది. దీంతో రాజకీయ వర్గాల్లో సరదాగా ఒక ప్రశ్న వినిపిస్తోంది.. “బొత్స కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారా? లేక కార్యకర్తలే బొత్సకు ధైర్యం చెబుతున్నారా?” అని అయితే ఈ పరిణామాలను కేవలం వ్యక్తిగత భావోద్వేగంగా చూడాలా, లేక విజయనగరం జిల్లాలో వైసీపీ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లకు ప్రతిబింబంగా చూడాలా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బొత్స మాత్రం శ్రేణులు ఐక్యంగా ఉండాలని, స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాలని వరుస సమావేశాల్లో పిలుపునిస్తున్నారు.

ప్రస్తుతం బొత్స సమావేశాల్లో కనిపిస్తున్న ఈ భావోద్వేగ దృశ్యాలు.. విజయనగరం వైసీపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న మార్పులకు మరో కోణాన్ని చూపిస్తున్నాయనే చర్చ సాగుతోంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

6 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

29 minutes ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

32 minutes ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

32 minutes ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

32 minutes ago