Home Uncategorizedఇలా ఉన్నారేంట్రా.. 25వేల వోల్టుల హై-టెన్షన్ కేబుల్‌ను –

ఇలా ఉన్నారేంట్రా.. 25వేల వోల్టుల హై-టెన్షన్ కేబుల్‌ను –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

బీహార్ రైల్వే దొంగతనం: చిన్నప్పుడు మనం స్టువర్టుపురం దొంగల గురించి పుస్తకాల్లో చదివి ఉంటాం లేదా టీవీలలో చూసి ఉంటాం. స్టువర్టుపురం దొంగలనే గజదొంగలని.. కరుడుగట్టిన చోర శిఖామణులు అని అనుకుంటాం.. కానీ నేటి కాలంలో వారిని మించిపోయారు. వీరు చేసిన దొంగతనం అలాంటిది మరి.. ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీయడం మాత్రమే కాదు.. రైల్వే శాఖ కే చుక్కలు చూపించారు. బీహార్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలంద, తక్షశిల […]

బీహార్ రైల్వే దొంగతనం: చిన్నప్పుడు మనం స్టువర్టుపురం దొంగల గురించి పుస్తకాల్లో చదివి ఉంటాం లేదా టీవీలలో చూసి ఉంటాం. స్టువర్టుపురం దొంగలనే గజదొంగలని.. కరుడుగట్టిన చోర శిఖామణులు అని అనుకుంటాం.. కానీ నేటి కాలంలో వారిని మించిపోయారు. వీరు చేసిన దొంగతనం అలాంటిది మరి.. ఏకంగా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీయడం మాత్రమే కాదు.. రైల్వే శాఖ కే చుక్కలు చూపించారు.

బీహార్ రాష్ట్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నలంద, తక్షశిల వంటి విద్యాసంస్థలు ఉన్న ప్రాంతం.. ఆ రోజుల్లోనే గుర్తింపు పొందింది.. కానీ ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు లేవు. అక్కడ దారిద్రం.. నిరక్షరాస్యత.. పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. పైగా అక్కడ పాలకులకు ప్రజల ఓటు వేసే యంత్రాలు మాత్రమే. అభివృద్ధి అంతగా అక్కడ కనిపించదు. అందువల్లే ప్రజలు దొంగతనానికి ఉంటారు

తాజాగా బీహార్ రాష్ట్రంలో ఒక చోరీ సంఘటన జరిగింది. అక్కడి దొంగలు ఏకంగా రైల్వే శాఖకు సంబంధించిన 25 వేల వోల్టుల ఓవర్ హెడ్ హై టెన్షన్ వైర్ చోరీ చేశారు. ఈ వైరులో 100 మీటర్లు కత్తిరించారు. ఫలితంగా సిగ్నల్.. కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింగిల్ లైన్ లోనే రైళ్లను నడపాల్సి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్టుకు సమీపంలోనే ఈ దొంగతనం జరగడం విశేషం. ఈ రైల్వే లైన్ అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గం మీదుగా రైళ్ల రాకపోకలు విపరీతంగా సాగుతూ ఉంటాయి.

ఈ దొంగతనం వెలుగులోకి రావడంతో మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసరమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇలాంటి దొంగతనం జరగడం ఇదే తొలిసారి. అంతటి విద్యుత్తు.. సమీపంలోకి వెళ్తేనే ఒళ్ళు వణికే పరిస్థితి కనిపిస్తోంది.. దొంగలు ఇలా దొంగతనం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

2 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago