వైఎస్ అవినాష్ రెడ్డి: మాజీ మంత్రి.. వైయస్ జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ పాత్ర ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక కుట్ర అవినాష్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈడీ అధికారులు బుధవారం దాదాపు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. వివేక హత్య కోసం ఖర్చు […]
వైఎస్ అవినాష్ రెడ్డి: మాజీ మంత్రి.. వైయస్ జగన్ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ పాత్ర ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక కుట్ర అవినాష్ రెడ్డి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఈడీ అధికారులు బుధవారం దాదాపు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. వివేకా కోసం 40 కోట్ల రూపాయల ఖర్చు చేయాలి అనుకున్నారు.. ఆర్థిక లావాదేవీలతో అవినాష్ రెడ్డికి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు విచారించినట్లు.. దర్యాప్తులో కీలక విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం.
ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తులకు ముందస్తుగా చెల్లించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో అధికారులు ప్రశ్నించారు. దీనికి ముందుగా అవినాష్ రెడ్డి మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత అప్రూవర్ గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలాన్ని అధికారులు కడప ఎంపీ ముందు ఉంచారు. ఈ వ్యవహారం వెనుక భారీగా సాగిన మనీలాండరింగ్ వ్యవహారాన్ని ఈడి ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. శివశంకర్ రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డి ద్వారా దస్తగిరి.. సునీల్ యాదవ్.. ఉమా రెడ్డికి ముందస్తుగా ఎలా డబ్బులు చేరాయి.. అనే దానిపై అధికారులు దృష్టి సారించారు. గతంలో సాక్షాత్తు వ్యక్తులు.. నిధితులు చెప్పిన విషయాలు.. అవినాష్ రెడ్డి చెప్పిన సమాధానాల మధ్య ఈడి అధికారులు గుర్తించారు.
ఇప్పటివరకు సేకరించిన లావాదేవీల ఆధారాలు.. పత్రాలు.. సాక్షుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు అవినాష్ రెడ్డి ముందు ఉంచారు. అయినప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో సహకరించలేదు. దీంతో అవినాష్ రెడ్డిని గురువారం కూడా విచారించే అవకాశం ఉంది. బుధవారం విచారణ తర్వాత మీడియా కంటపడకుండాష్ రెడ్డి వెనుక వైపు మార్గం మీదుగా వెళ్లిపోయారు. సిబిఐ దర్యాప్తు సమయంలో అరెస్టు నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డిని.. ఈసారి మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు వైయస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నారు. ఈడి ఇస్తున్న సంకేతాలు కూడా ఇదేవిధంగా ఉన్నాయి. ఇతరులతో ఉన్న సంబంధాలు.. ఆదాయాలు.. ఇతర వ్యవహారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. దీంతో అవినాష్ రెడ్డి కుటుంబం మొత్తం ఆందోళన చెందుతోంది. ఈ రోజుల్లో వెలుగు చూస్తున్న అంశాలు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంచలన పరిణామాలకు దారితీస్తాయనేది చూడాల్సి ఉంది.