Home Uncategorizedదైవాలగూడ ఘటన.. రాజ్ కుమార్ తో 20 లక్షల డీల్.. –

దైవాలగూడ ఘటన.. రాజ్ కుమార్ తో 20 లక్షల డీల్.. –

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

Daivalaguda Case: షాబాద్ మండలంలో దైవాలగూడలో ఆరుగురుని హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఇతడి మీద ఫోక్సో కేసు నమోదయింది. ఆ కేసులో బెయిల్ వచ్చే విధంగా సెక్షన్ లు ఉండటంతో రాజ్ కుమార్ పెద్దగా ఇబ్బందులు లేకుండానే బయటికి వచ్చాడు. పైగా ముందస్తుగా బెయిల్ సంపాదించాడు.. అతడు ఆ బాలికను మరింత వేధించడం మొదలుపెట్టాడు.. ఈవీవీ మీడియాలో ఇప్పటికే వస్తున్న వార్తలు.. రాజ్ కుమార్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ […]

Daivalaguda Case: షాబాద్ మండలంలో దైవాలగూడలో ఆరుగురుని హత్య చేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఇతడి మీద ఫోక్సో కేసు నమోదయింది. ఆ కేసులో బెయిల్ వచ్చే విధంగా సెక్షన్ లు ఉండటంతో రాజ్ కుమార్ పెద్దగా ఇబ్బందులు లేకుండానే బయటికి వచ్చాడు. పైగా ముందస్తుగానే బెయిల్ సంపాదించాడు.. అతడు ఆ బాలికను మరింత వేధించడం మొదలుపెట్టాడు.. ఈవీమీడియాలో వస్తున్న వార్తలు..

రాజ్ కుమార్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించింది. అక్కడి ఎస్ఐ ని సస్పెండ్ చేసింది. సీఐపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అంతర్గత విచారణలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటామని.. ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న ఈ ఒక్క పోలీస్ అధికారులు కూడా వదిలిపెట్టబోమని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం మీద భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్ర స్థాయిలో స్పందించారు.

సబిత ఇంద్రారెడ్డి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… పద్మా దేవేందర్ రెడ్డి.. సత్యవతి రాథోడ్ వంటి నాయకులు ఆందోళన నిర్వహించారు. కనీసం రివ్యూ చేయలేకపోతున్నారని.. ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ వెంటనే రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇదంతా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్ల జరుగుతోందని ఆయన చెప్పారు.

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత బాలికపై పెట్టిన ఫోక్సో కేసులో అరెస్ట్ అవకుండా ఉండేందుకు రాజ్ కుమార్ ఏకంగా 20 లక్షలు ఇచ్చాడని సమాచారం. ఆ స్థాయిలో డబ్బు ఇచ్చాడు కాబట్టే పోక్సో కేసులో పోలీసులు కఠిన సెక్షన్లను పెట్టలేదు. కేవలం స్టేషన్ బెయిల్ వచ్చే కేసులుమాత్రమే నమోదు చేశారు.

పోలీసుల చేతికి భారీగా డబ్బులు వచ్చాయని అందుకే రాజ్ కుమార్ కు వత్తాసుపలికారని బాలిక బంధువులు చెబుతున్నారు. రాజ్ కుమార్ బెదిరింపులకు చనిపోయినట్లు పోలీసులు చెప్పగా పట్టించుకోలేదని బాలిక బంధువులు చెబుతున్నారు. పదేపదే చంపుతామని బెదిరిస్తున్నాడని, ప్రాణ భయం ఉందని పోలీసులు పట్టించుకోలేదని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాలిక బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి ఎస్ఐ పై వేటు వేశారు. సీఐపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

42 minutes ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

1 hour ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

1 hour ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

1 hour ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

1 hour ago