Home సినిమానేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు.. కేవలం ఆ జిల్లాల వారికే! – RMK NEWS

నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు.. కేవలం ఆ జిల్లాల వారికే! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


Smart Ration Cards In AP: ఏపీ ప్రభుత్వం( AP government ) గుడ్ ప్రజలకు న్యూస్ చెప్పింది. పేదలకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఈరోజు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో కోటి 45 లక్షల మంది రేషన్ కార్డుదారులకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నీటి నుంచి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో 1.45 కోట్ల కార్డుదారులకు గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది.

ఇది కూడా చదవండి: రామ్ చరణ్ తో నటించడానికి నో చెప్పిన యంగ్ బ్యూటీ..మండిపడుతున్న ఫ్యాన్స్!

* కొత్త రేషన్ కార్డులు సైతం..
పాత రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు( స్మార్ట్ కార్డులు ) అందించడంతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా అందించబడతాయి. 6.71 లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని వేడుకగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మరోవైపు రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియగా చెబుతోంది ప్రభుత్వం. స్మార్ట్ రేషన్ కార్డుల పై ప్రభుత్వ రాజముద్ర, కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి. స్మార్ట్ రేషన్ కార్డుల జారీ, పంపిణీలో సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు సంప్రదించవచ్చు.

* నాలుగు విడతల్లో పంపిణీ..
ఈరోజు నుంచి 4 విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరగనుంది. తొలి విడతలో భాగంగా విశాఖ,విజయనగరం, నెల్లూరు,ఎన్టీఆర్, తిరుపతి, కృష్ణా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో పంపిణీ చేస్తారు. ఆగస్టు 30 నుంచి గుంటూరు, ఏలూరు, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. చివరి విడతగా సెప్టెంబర్ 15 నుంచి పల్నాడు, బాపట్ల, వైయస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాలో స్మార్ట్ ఫ్యాషన్ కార్డుల పంపిణీ జరగనుంది. వచ్చేనెల రేషన్ కు సంబంధించి ఈ స్మార్ట్ కార్డుల ద్వారానే పంపిణీ జరగనుంది. ఈ స్మార్ట్ కార్డుల సరఫరా పూర్తిగా ఉచితం.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

23 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago