ది ప్యారడైజ్: రాడ్ సినిమా.. చెత్త సినిమా.. సోది సినిమా.. ఈ మాత్రం దానికి మూడు గంటలు అవసరమా.. పైగా విపరీతమైన రక్తం.. తట్టుకోలేని స్థాయిలో హింస.. మోహన్ బాబు పాత్ర పేలవం.. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది. […]
స్వర్గం: రాడ్ సినిమా.. చెత్త సినిమా.. సోది సినిమా.. ఈ మూడు గంటలు అవసరమా.. పైగా విపరీతమైన రక్తం.. తట్టుకోలేని స్థాయిలో హింస.. బీ స్థాయిలో కాయదులోహర్ అందాల ప్రదర్శన.. మోహన్ బాబు పాత్ర పేలవం.. కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది.. ఇదిగో ఇలా సాగిపోతోంది నాని నటించిన ప్యారడైజ్ సినిమా పై నెగిటివ్.
నిజానికి ఈ సినిమా అంత చెత్తగా ఉందా.. మరి దారుణంగా ఉందా… టాక్సిక్ లాంటి రాడ్ రంబోలా నా.. కంప్లీట్ యాక్టర్ లాంటి నాని.. నాచురల్ పెర్ఫామెన్స్ చూపించే నాని.. ఇలాంటి సినిమా ఎలా తీశాడు.. కథ విషయంలో.. కథనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే నాని ఇలాంటి తప్పటడుగులు నటించడం సాధ్యమేనా. నిజానికి ఒక పద్ధతి ప్రకారం.. ది ప్యారడైజ్ సినిమా మీద నెగటివ్ ప్రచారం. కెసిఆర్ పాత్రను ఇందులో చాలామంది తప్పు పడుతున్నారు. అసలు కెసిఆర్ పాత్రను బలవంతంగా చూపించడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఎవరికివారు విశ్లేషణలు చేస్తున్నారు. ఒకరకంగా ది ప్యారడైజ్ సినిమా మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా రాండ్ రాక్లాగా ఉంటుందని మేకర్స్ చెబుతూనే ఉన్నారు. గుర్తింపు కోసం ఒక జాతి చేసే పోరాటం.. దాని వెనుక ఉన్న సంఘర్షణ మొత్తం ఈ కథ అని దర్శకుడు అంటూనే ఉన్నారు. కానీ కొందరు పనిగట్టుకుని చిత్రం మీద నెగిటివ్ ప్రాపగాండ చేస్తున్నారు. ఒక సినిమా నచ్చకపోతే చూసిన వాళ్ళు చెప్పాలి. అంతేగాని విశ్లేషకులు ముసుగులో ఉన్న వాళ్ళు విషం చిమ్మడమే ఇక్కడ అసలైన విషాదం.. సినిమాలో హీరోయిన్ పాత్ర.. మోహన్ బాబు పాత్రను కొన్ని సన్నివేశాల్లో మినహాయించారు.. మిగిలిన అన్నిట్లోనూ దర్శకుడు బాగానే రాసుకున్నాడు. ప్రాపర్ గానే ఎగ్జిక్యూషన్ చేశాడు. కానీ ఆ బాగా లేని సన్నివేశాల కోసం కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అందువల్లే ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రారంభమైంది.
నిజానికి ఈ సినిమాలో తీసిపారేసే సన్నివేశాలు లేవు. అలాగని చెత్త కథ కూడా కాదు. బలమైన కథనం లేదు. అని బాగానే ఉన్నాయి. కాకపోతే హై రేంజ్ అంచనాలతో వెళ్తే మాత్రం సినిమా అంతగా సాటిస్ఫై చేయదు. పాటలు బాగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే ఉంది. కాకపోతే థియేటర్లలో సౌండ్ అధికంగా పెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో నాని చెప్పిన డైలాగులు అర్థం కాదు. సౌండ్ మిక్సింగ్ లో బేస్ ఎక్కువగా వాడినట్టుగా ఉంది. అందువల్లే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా అర్థం కాదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం.. ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం.. క్లైమాక్స్ అదరగొడతాయి. అయితే హీరోయిన్ ను చూపించిన తీరు.. మోహన్ బాబు పాత్ర ముగించిన తీరు అంత జనాలకు డైజెస్ట్ కాదు. కాకపోతే కొన్ని సన్నివేశాలలో శ్రీకాంత్ తన పని తీరును కనపరిచాడు. తనను ఎందుకు రా అండ్ రాక్టిక్ అంటారో నిరూపించాడు.. ఈ స్థాయిలో ఎలిమెంట్స్ పరిస్థితి.. కొన్ని లో మాత్రమే భూతద్దం పెట్టి చూస్తున్నారు.
సినిమా సినిమా లాగా చూడండి. ప్యారడైజ్ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఆపండి. @odela_srikanth @NameisNani @11Lohar @KeerthyOfficial #పారడైజ్ @themohanbabu #sampurneshbabu pic.twitter.com/sfAH5decrc
— ఎనబోతుల భాస్కర్ (@bhasamudra) సెప్టెంబర్ 24, 2026