Home క్రీడలుRaghu Master Sumalatha Devi: సుమలత వర్సెస్ రఘు మాస్టర్ – RMK NEWS

Raghu Master Sumalatha Devi: సుమలత వర్సెస్ రఘు మాస్టర్ – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


రఘు మాస్టర్ సుమలతా దేవి:“సుమలత (కొరియోగ్రాఫర్ జానీ వైఫ్) పాలటిక్స్ ఏర్పాటు.. ఈ రాజకీయాలు మాకు అవసరం లేదు. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే.. మేము ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా. బయటికి వెళ్లి మేము రాజకీయాలు చేసుకుంటాం కదా. వారు పని చేయడం లేదని అందరికీ తెలుసు. అందుకే కదా మేము వచ్చింది..” డాన్సర్ రఘు మాస్టర్ […]

రఘు మాస్టర్ సుమలతా దేవి:“సుమలత (కొరియోగ్రాఫర్ జానీ వైఫ్) పాలటిక్స్ చేస్తోంది.. ఈ రాజకీయాలు మాకు అవసరం లేదు. ఒకవేళ రాజకీయాలు చేయాలనుకుంటే.. మేము ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కదా. బయటికి వెళ్లి మేము రాజకీయాలు చేసుకుంటాం కదా. వారు ఎటువంటి పని చేయడం లేదని అందరికీ తెలుసు. అందుకే మేము వచ్చింది..” జానీ మాస్టర్ భార్య సుమలతను ఉద్దేశించి ప్రముఖ కొరియోగ్రాఫర్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు.

డాన్సర్ రఘు మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన సుమలతపై నేరుగానే విమర్శలు చేశారు. సమలత రాజకీయంగా ఉందని రఘు ఇటీవల కాలం నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. రఘు మాస్టర్ సుమలత వివాదం వ్యక్తిగత గొడవను దాటిపోయింది. తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ పై ఆధిపత్యం, కార్యవర్గానికి సంబంధించిన చట్టబద్ధత.. యూనియన్ రికార్డులు.. ఎన్నికల వంటి వాటి చుట్టూ తిరుగుతోంది. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి..

రఘు అలా ఎందుకు అన్నారు..

సుమలత రాజకీయాలు చేస్తోంది. మాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలు చేయాలనుకుంటే బయటకు వెళ్లి మేము చేస్తాం. వాళ్లు ఏ పని చేయడం లేదు కదా మేము వచ్చింది అని డాన్స్ మాస్టర్ రఘు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో.. టాలీవుడ్ లో చర్చకు దారి తీస్తున్నాయి. నిజానికి రఘు మాస్టర్ అంత ఘాటుగా ఎందుకు స్పందించాల్సి వచ్చింది.. సుమలత ఏం చేశారు.. అసలు ఇద్దరి మధ్య గొడవ ఎందుకు మొదలైంది.. అతనికి ఇది బయటి రాజకీయాల కథ కాదు. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) లో సాగుతున్న ఒక రకమైన అంతర్గత పోరు. అయితే ఇప్పుడు యూనియన్ కార్యవర్గం.. అందులో ఫెడరేషన్ జోక్యం చేసుకోవడం.. పోలీసుల ఫిర్యాదులు.. సమావేశాల సమయంలో ఘర్షణలు మొత్తంగా ఎన్నికల వరకు వెళ్లాయి.

ఇంతకీ సుమలత ఎవరు

సుమలత అలియాస్ సుమలత దేవి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి. ఈమె తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఈమె ప్రస్తుతం ఏర్పాటు అయిన కార్యవర్గం విషయంలో విపరీతమైన విభాగం కొనసాగుతోంది. రఘు మాస్టర్ వర్గం సుమలత నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుమలత వర్గం రఘు మాస్టర్ ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ కమిటీకి ఎటువంటి చట్టబద్ధత లేదని వాదిస్తోంది.

వివాదం ఎందుకంటే

డాన్సర్స్ అసోసియేషన్‌లో నాయకత్వం.. అధికారికంగా గుర్తింపు. యూనియన్ నిర్వహణ.. నిధులు.. బ్యాంకులలో జరిగిన ఆర్థిక లావాదేవీలు.. ఈ అంశాల మీద ఇరు వర్గాల మధ్య విభేదాలు పెరిగాయి. ప్రత్యామ్నాయ కార్యవర్గాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సుమలత వర్గం అడ్డు చెప్పింది. రఘు మాస్టర్ కమిటీకి చట్టబద్ధత లేదని వ్యాఖ్యానించింది. ఈ వివాదంలో ఫిలిం ఫెడరేషన్ జోక్యం చేసుకోవడంతో మరింత పెరిగింది. ఫిలిం ఫెడరేషన్ నిర్వహించిన సమావేశానికి 225 మంది డ్యాన్సర్లు. ఇక్కడ నిర్వహించిన రఘు మాస్టర్ కు ఏకంగా 214 మంది సపోర్ట్ చేశారు. శుభలతకు కేవలం 11 మాత్రమే సపోర్ట్ చేశారు. దీంతో సుమలత ఆధ్వర్యంలోని సభ్యులు అధికారాలను కోల్పోయారు. కొత్త కార్యవర్గ ఎన్నికకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించాలని ఫెడరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

అసలు ఉద్దేశం ఏమిటి

మరి ఇదంతా జరిగినప్పుడు సుమలత రాజకీయాలు చేస్తోందని ఆరోపించడం వెనక అసలు ఉద్దేశం ఏమిటి. డాన్సర్స్ అసోసియేషన్‌లో జరుగుతున్న వర్గ పోరు.. ఆధిపత్య పౌరుని ఉద్దేశ్య రఘు మాస్టర్ ఆ వ్యాఖ్యలు చేసి చూపించారు. అందుకే మాకు ఈ రాజకీయాలు చేయాలనుకుంటే బయటకు వెళ్లి ఆయన పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది. దీనికి తోడు ఇటీవల జరిగిన సమావేశాల్లో అసోసియేషన్ కి సంబంధించిన మినిట్స్ బుక్.. అజెండా పత్రాలు వంటి రికార్డుల విషయంలో వివాదాలు మరింత ముదిరాయి. సుమలత వర్గం చెబుతున్న దాని ప్రకారం కొందరు వ్యక్తులు అసోసియేషన్ రికార్డులను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు . వాటిని సుమలత అడ్డుకున్నారు నేనే పద్యంలో తన పై దాడి జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కూడా ఆఫిర్యాదులు ఆమె పేర్కొన్నారు. మరోవైపు రఘు మాస్టర్ వర్గ మాత్రం మినిట్స్ పుస్తకాన్ని తీసుకెళ్లడానికి తాను ప్రయత్నించలేదని.. దాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తే అడ్డుకున్నారని రఘు. మరి ఈ మధ్య వివాదం సమసి పోవాలంటే ఇద్దరికీ ఏదైనా అద్భుతం జరగాలి.



You may also like

Leave a Comment