The Paradise: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. ఈ సినిమాలో నాని పాత్ర.. అందులో ఉన్న కథ.. ప్యారడైజ్ ప్రపంచం.. సవారి సమాజం.. కాకుల సమూహం.. బురద.. వర్షం.. బిర్యాని. గుర్తింపు.. ఇలా ప్రతి అంశం వెనుక ఏదో ఒక అర్థం ఉన్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సినిమాలో ఎందుకు చూపించారు ఈ సినిమాలో ప్రధానంగా ధూమవతి అనే దేవత ప్రస్తావన ఉంది. నిజానికి ధూమవతినే […]
స్వర్గం: ది ప్యారడైజ్ సినిమా గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. ఈ సినిమాలో నాని పాత్ర.. అందులో ఉన్న కథ.. ప్యారడైజ్ ప్రపంచం.. సవారి సమాజం.. కాకుల సమూహం.. బురద.. వర్షం.. బిర్యాని. గుర్తింపు.. ఇలా ప్రతి అంశం వెనుక ఏదో ఒక అర్థం ఉన్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆ సినిమాలో ఎందుకు చూపించారు
ఈ సినిమాలో ప్రధానంగా ధూమవతి అనే దేవత ప్రస్తావన ఉంది. వాస్తవానికి ధూమవతినే దేవతగా ఆ సినిమాలో ఎందుకు చూపించారు.. ఒక కులదేవతగా ఎందుకు ప్రతిష్టించారు.. కాకలతో ఈమెకు సంబంధం ఏంటి.. చుట్టూ ఉన్న పొగ.. విస్తారంగా కురిసే వర్షం.. బురద.. ఇవన్నీ ఆమెతో ఎలా ఉన్నాయి.. అయితే వీటి గురించి తెలుసుకుంటే ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలకు అర్థం అయ్యే అవకాశం.
మనకు సాధారణంగా దుర్గ.. లక్ష్మి.. సరస్వతి వంటి దేవతల కథలు తెలుసు. కానీ ధూమవతి దశ మహా విద్యలలో ఏడవ మహా విద్య. ఈమెను సవారి సమాజానికి కులదేవతగా ఉపయోగిస్తుంటారు. ధూమవతి అంటే ధూమ లేదా పొగ అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. వాస్తవానికి ఈమె రూపం ఇతర దేవతల మాదిరిగా ఉండదు. అందం కనిపించదు. అలంకారం చేతిలో ఉండదు.. శాక్త.. తాంత్రిక సంప్రదాయాలలో ఈమెను వృద్ధురాలుగా.. వితంతువుగా.. జుట్టు విరబోసుకునే.. చాట లేదా షూర్పం పట్టుకొని.. కాకిపై లేదా కాకితో సంబంధం ఉన్న రూపంలో.. స్మశానం లేదా నిర్జన ప్రదేశాలలో ఈ మన చిత్రీకరిస్తారు.
ఈ దేవత సంపదకు ప్రతీక కాదు. సంపద పోయిన తర్వాత ఏం మిగులుతుందో ఈమె శక్తి రూపంలో చూపిస్తుంది. భరించలేని ఆకలి.. తట్టుకోలేని ఒంటరితనం.. ఓర్చుకోలేని.. ఇబ్బంది పడే నిరాశ.. చికాకు పెట్టే వృద్ధాప్యం.. భూమిమీద లేకుండా చేసే మరణం.. రేపు అనేది లేకుండా చేసే విధ్వంసం.. ఆశను రేకెత్తకుండా చేసే తిరస్కరణ.. ఇలా సమాజపు అంచులకు నెట్టివేతకు గురైన జీవితం వంటి అంశాలకు ప్రతీకగా ధూమవతి నిలుస్తుంది.
ధూమవతి జననం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం.. భార్య తనను తాను దహనం చేసుకున్న తర్వాత వచ్చిన పొగ నుంచి ధూమవతి ఆవిర్భవించిందని చెబుతారు. మరో తాంత్రిక పురాణ కథలో సత్తి తీవ్ర ఆకలితో శివుడినే మింగింది. అనంతరం శివుడు శాపంతో వితంతు రూపాన్ని పొందాడు. అందుకే ధూమవతి విషయంలో ఏదో ఒక సృష్టి ప్రారంభం అనే విషయం కంటే విధ్వంసం తర్వాత మిగిలిన స్థితి అనే విషయం ప్రస్తుతానికి వస్తుంది.
ప్యారడైజ్ సినిమాలో ధూమవతిని పెట్టడానికి ప్రధాన కారణం ఈమెను సవారి సమాజానికి కుల దేవతగా చూపించారు. సవారి సమాజం పతనం అంచుల్లో ఉంటుంది. వారికి ఆహారం లభించదు. గుర్తింపు ఉండదు. స్థిరమైన నివాసం కూడా ఉండదు. అందుకే ఆమెను సంపదను ప్రసాదించే దేవత కంటే ఆకలి నుంచి.. బాధ నుంచి.. తిరస్కరణ నుంచి.. అణచివేత నుంచి గట్టిగా నిలబెట్టే దేవతలాగా చూపించారు.. ఇక ఈ సినిమాలో ధూమవతి దేవతతో వాహనం లేదా కాకితో బలమైన సంబంధం ఉందని చూపించారు.
సవారిలు కాకులను అనుసరించి ఒక చేరుకుంటారు. ఆ ప్రాంతాన్ని వారు ప్యారడైజ్ అని భావిస్తున్నారు.. అంటే వాళ్ళ దృష్టిలో కాకులు ఒక దేవతకు సంకేతం. కాకుల ద్వారా కొత్త ప్రవేశానికి చేరుకుంటారు. అక్కడ వారు తమ ఇల్లును నిర్మించుకుంటారు. అందుకే ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది. అందుకే ఈ సినిమాలో కాకులు కేవలం భయపెట్టడానికి సంకేతాలు మాత్రమే కాదు.. వాళ్లకు దారి చూపించే మార్గాలు కూడా.