శుక్రవారం OTT: భారీ సెట్టింగ్‌లు లేవు. తారాగణం అంతకంటే లేదు. పిరియాడికల్ డ్రామా కాదు. జస్ట్ నార్మల్ స్టోరీ.. ఒక కుటుంబానికి సంబంధించిన స్టోరీ.. ఆ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు.. దిమ్మ తిరిగిపోయే విఎఫ్ఎక్స్ షాట్లు లేవు.. కేవలం ఒక కుటుంబ కథ.. అది కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథ.. ఆ కథనే వందల కోట్లు సంపాదించి పెట్టింది. నేటి ఓటిటి కాలంలో గొప్ప గొప్ప […]
శుక్రవారం OTT: భారీ సెట్టింగ్‌లు లేవు. తారాగణం అంతకంటే లేదు. పిరియాడికల్ డ్రామా కాదు. జస్ట్ నార్మల్ స్టోరీ.. ఒక కుటుంబానికి సంబంధించిన స్టోరీ.. ఆ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేవు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు.. దిమ్మ తిరిగిపోయే విఎఫ్ఎక్స్ షాట్లు లేవు.. కేవలం ఒక కుటుంబ కథ.. అది కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథ.. ఆ కథనే వందల కోట్లు సంపాదించి పెట్టింది.
నేటి ఓటి కాలంలో గొప్ప గొప్ప సినిమాలు కావాలని.. భారీ కాస్ట్ అండ్ క్రూ కావాలని ప్రేక్షకులు అనుకోవడం తప్పు. ఎందుకంటే తాజాగా మలయాళం లో బెత్లెహెం కుటుంబం యూనిట్ అనే ఒక సినిమా వచ్చింది. ఈ నివిన్ పౌలి.. మమత బైజు.. మమత బైజు.. బిందు పనికర్.. సురేష్ కృష్ణ.. వినయ్ పోర్ట్.. శ్రీ నిద.. సమీర్ ఖాన్.. మీనాక్షి రవీంద్రన్.. శ్యామ్మోహన్.. రోషన్ షాన్వాస్.. పార్వతి అయ్యప్ప దాస్.. జయశంకర్. ఈ సినిమా లీడ్ రోల్ లో మమత బైజు.. నివిన్ పౌలి నటించారు. ఈ సినిమాకు దర్శకుడిగా గిరీష్.. సంగీతం విష్ణు విజయ్.. సినిమాటోగ్రఫీ అజ్మల్ సాబ్.. నిర్మాతలుగా ఫహద్ ఫాసిల్.. దిలీష్ పోతన్.. శ్యామ్ పుష్కరన్ చేశారు.
ఒక సాధారణ సినిమాగా ఇది మలయాళం లో విడుదలైంది. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వందల కోట్లు వసూలు చేసింది.. ఈ సినిమాలో జస్టిన్ డేవిస్ పాత్రలో నివిన్.. యాష్లే పాత్రలో మమత కనిపించారు. క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ ఉండే జస్టిస్ డేవిస్.. ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. కాకపోతే ఆ ప్రేమ విఫలమవుతుంది. మళ్లీ ప్రేమలో పడకూడదు అనుకుంటాడు. మమత అతని జీవితంలోకి రావడంతో ఒక్కసారిగా కథ మొత్తం మారిపోతుంది. మమత విదేశాల నుంచి వచ్చిన యువతగా నటించింది. హిమ తండ్రి విపరీతంగా తాగుతూ ఉంటాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఆమెకు ఇబ్బంది పడుతుంటాయి. సంగీతంపై ఉన్న ఆసక్తితో బ్యాండ్ వాయిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జస్టిన్ తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం.. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంపొందించడం.. ఆధ్యాత్మిక విలువలను సమాజంలో విస్తరించడం వంటి వాటిని చిత్రంలో ప్రముఖంగా చూపించారు. ఆధునిక జీవనశైలిలో కుటుంబ సంబంధాలు, పరస్పర అవగాహన, మానవ విలువలు క్రమంగా జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ ఐక్యతను పెంపొందించేందుకు ఏం చేయాలో ఈ చిత్రాన్ని చూపుతుంది.
గురువారం అర్ధరాత్రి నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ఫ్యామిలీ సినిమా చూడాలి.. ఎటువంటి అసభ్య పదజాలం లేకుండా.. అసభ్య పదజాలం లేకుండా సినిమా వీక్షించాలి అనుకునే వారికి ఈ చిత్రం ఒక ఖచ్చితమైన ఎంపిక.