Home Uncategorizedవాహనంలో భారీ చోరీ.. చేతబడి చేస్తే దొంగ బయటికి – Jananethram News

వాహనంలో భారీ చోరీ.. చేతబడి చేస్తే దొంగ బయటికి – Jananethram News

by RMK NEWS
0 comments
Oktelugu Epaper


కష్టపడకుండా సొమ్ము సంపాదించాలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోవాలి.. నేటి కాలంలో చాలామంది వ్యవహార శైలి ఇలానే ఉంది. డబ్బులు సంపాదించడానికి ఎటువంటి దుర్మార్గాలకైనా.. ఎటువంటి అన్యాయాలకైనా ఉండటానికి వెనుకంజ వేయడం లేదు. అందుకే నేటి కాలంలో దుర్మార్గాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలో ఒక కుటుంబం […]

కష్టపడకుండా సొమ్ము సంపాదించాలి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు గా మారిపోవాలి.. నేటి కాలంలో చాలామంది వ్యవహార శైలి ఇలానే ఉంది. డబ్బులు సంపాదించడానికి ఎటువంటి దుర్మార్గాలకైనా.. ఎటువంటి అన్యాయాలకైనా ఉండటానికి వెనుకంజ వేయడం లేదు. అందుకే నేటి కాలంలో దుర్మార్గాలు.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం. ఈ ప్రాంతంలో ప్రకాష్ నగర్ ఏరియాలో ఒక బహుళ అంతస్థుల భవనం ఉంది. ఈ భవనంలో ఒక కుటుంబం నివసిస్తోంది. గత నెలలో ఈ కుటుంబం ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారం చోరీ చేశారు.

ఈ చోరీ తర్వాత బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే తెలిసినవాళ్లే ఈ దొంగతనానికి హాజరయ్యారు. కాకపోతే వాళ్లు బయటికి రాలేదు.” చోరీకి గురైన డబ్బు.. బంగారాన్ని తిరిగి రాబట్టడానికి బాధిత కుటుంబ సభ్యులు మంత్రాలు చేయడం. చేతబడి కి దిగారు. ఎలాగైనా సరే ఆ డబ్బు.. బంగారం వారికి తిరిగి వస్తుందని” చుట్టుపక్కల వారు అనడం మొదలుపెట్టారు. దీంతో ఆ దొంగలో భయం మొదలైంది.

చేతబడి వల్ల తన ప్రాణాలకు ముప్పు తప్పదని ఆ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి భావించాడు. అతనికి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణాలు పోతాయని భయం మొదలైంది. దీంతో అతడు 19 నగదు ఒక బ్యాగులో ప్యాక్ చేసి.. దొంగతనం చేసిన ఇంటి ఎదుట పెట్టాడు. అందులో ఒక లెటర్ రాశాడు..”మేము దొంగతనం చేసాం.దాదాపు 25 లక్షల నగదు.. 317 గ్రాముల బంగారాన్ని దొంగిలించాం.నా వాటాగా 19 లక్షలు తీసుకున్నాను.అందుకే ఆ నగదు బ్యాగులో పెట్టి మీకు ఇస్తున్నాను. మిగిలిన సొమ్ము గురించి నాకు తెలియదు. నన్ను అడగవద్దు..” అని అతడు ఆ లేఖలో పెద్ద అక్షరాలతో రాశాడు. అయితే దొంగల కోసం ఆ ఇంటి యజమాని అంజనం వేయించాడని.. చేతబడి చేస్తున్నాడని చుట్టుపక్కల వారు ప్రచారం చేశారు. దీంతో ఆ దొంగ భయపడి డబ్బు తిరిగి ఇచ్చేసాడని తెలుస్తోంది. మరో దొంగ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధ పడినట్టు ప్రచారం జరుగుతోంది.



You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

21 hours ago
Good Morning

Good Morning

24 hours ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago