Home అంతర్ జాతీయMotorola:200 MP కెమెరా.. ఇంకా ఎన్నో ఫీచర్లు.. మోటోరోలా నుంచి రాబోయే స్మార్ట్ ఫోన్లు ఇవే. -RMK NEWS

Motorola:200 MP కెమెరా.. ఇంకా ఎన్నో ఫీచర్లు.. మోటోరోలా నుంచి రాబోయే స్మార్ట్ ఫోన్లు ఇవే. -RMK NEWS

by RMK NEWS
0 comments
Motorola:200 MP కెమెరా.. ఇంకా ఎన్నో ఫీచర్లు.. మోటోరోలా నుంచి రాబోయే స్మార్ట్ ఫోన్లు ఇవే.

మోటరోలా: క్రమంగా మోటరోలా కంపెనీ భారత మార్కెట్ మీద తీవ్రంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ను దృష్టిలో పెట్టుకొని మోటరోలా ఈ మోడల్స్ రూపొందించింది. దీనికి సంబంధించిన వివరాలు గీక్ బెంచ్ ద్వారా బయటికి వచ్చాయి.. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలలో

గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలలో భాగంగా మోటరోలా ఎడ్జ్ 70 నియో అనే మోడల్ ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌లో qualcom Snapdragon 7 S Gen(ఇది మార్కెటింగ్ పేరు, చిప్ సెట్ కోడ్ QTI SM 7635) ప్రాసెసర్ ఇందులో ఉంది. మోటోరోలా కంపెనీ ఇదే చిప్ ను ఎడ్జ్ 70 ప్లస్ లో కూడా అమర్చింది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది గ్లాబల్ వెర్షన్ కు రీ బ్రాండెడ్ వేరియంట్ అని విశ్లేషకులు అంటున్నారు.

సాధారణ వాడకానికి ఇది అద్భుతం

గీక్ బెంచ్ నిర్వహించిన పరీక్షలో సింగిల్ కోర్‌లో 723 పాయింట్లు.. మల్టీ కోర్‌లో 2,943 పాయింట్లు వచ్చాయి. ఆల్ట కోర్ ప్రాసెసర్ లో నాలుగు కోర్లు, 1.80 GHz, 1 ప్రైమ్ కోర్, 2.5O GHz క్లాక్ స్పీడ్ ద్వారా ఇవి పనిచేస్తాయి. గ్రాఫిక్స్ విషయంలో కూడా మోటరోలా ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. ఇందులో అడ్రెనో 810 జిపియు ఏర్పాటు చేసింది. ఈ ఫోన్ 6 GB రామ్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్ పక్కన పెడితే.. సాధారణ వాడకానికి ఇది అద్భుతంగా సరిపోతుంది. కాకపోతే ఇది మిడ్ రేంజ్ చిప్ లాగా ఉంది.

డిజైన్ విషయంలో..

డిజైన్ విషయంలో ఇది దాదాపు 6.3 కాంపాక్ట్ డిస్ ప్లే ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా మార్కెట్లోకి వచ్చే తొలి ఫ్రీ లోడెడ్ ఫోన్ ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ పింక్.. డార్క్ గ్రీన్.. లైట్ వైట్.. లైట్ బ్లూ అనే రంగుల్లో లభిస్తుంది. ఫోన్ వెనక 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. డిస్ ప్లే, బ్యాటరీ.. ఇంకా ఇతర వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కస్టమర్లు కోరుకునే ధరల ప్రకారం చూసుకుంటే ఇది 2500 ఈఎంఐ ఆప్షన్ ద్వారా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ధరలోనే ఈ ఫోన్ ఉంది. స్టైల్ కోరుకునే వాళ్లకు.. బడ్జెట్ ధరుకునే వాళ్లకు ఈ ఫోన్ ఎంపికను ఉత్తమమని టెక్ నిపుణులు చెబుతున్నారు.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
TANA Women : తానా మహిళల కోసం ప్రత్యేకంగా 'దేశీ డాన్స్ -RMK NEWS

250 మందికిపైగా హాజరు TANA మహిళలు : హంటర్స్‌విల్లే: మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఉత్తర అమెరికా…

23 hours ago
Good Morning

Good Morning

1 day ago
ఒక పట్టుచీర గతంలో చేసిన ఓ దొంగను పట్టించింది.. - Jananethram News

[ad_1] హైదరాబాద్ క్రైం : పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన లోకం మొత్తం చీకటి కాదు.…

1 day ago
Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ - RMK NEWS

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా లెన్స్ వేసుకొని…

1 day ago
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడు సైబర్ దొంగ - RMK NEWS

[ad_1] BRS మాజీ MLA : ప్రతి సమావేశంలోనూ కేటీఆర్ ఒకటే చెప్తున్నారు. 2028లొ తెలంగాణలోకి అధికారంలోకి వచ్చేది…

1 day ago