Home జాతీయఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అమెరికా టూర్‌.. న్యూయార్క్‌ మేయర్‌ కీలక వ్యాఖ్యలు! – RMK NEWS

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ అమెరికా టూర్‌.. న్యూయార్క్‌ మేయర్‌ కీలక వ్యాఖ్యలు! – RMK NEWS

by RMK NEWS
0 comments
Oktelugu Epaper

RSS చీఫ్ మోహన్ భగవత్: జోహ్రాన్‌ మామ్దాని.. అగ్రరాజ్యం అమెరికా రాజధాని న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికై అధికార పార్టీకి షాక్‌ ఇచ్చాడు. యువ సంచలనంగా మారాడు. అయితే ఈ మామ్దాని పచ్చి భారత వ్యతిరేకి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన వాయిదాకు మామ్దానితో భేటీ కూడా ఒక కారణంగా ఉంది. అమెరికాలో ఆయన ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన నేతే. కానీ, భారత్‌పై ప్రధాని విషం చిమ్ముతూ, మోదీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ […]

RSS చీఫ్ మోహన్ భగవత్: జోహ్రాన్‌ మామ్దాని.. అగ్రరాజ్యం అమెరికా రాజధాని న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికై అధికార పార్టీకి షాక్‌ ఇచ్చాడు. యువ సంచలనంగా మారాడు. అయితే ఈ మామ్దాని పచ్చి భారత వ్యతిరేకి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన వాయిదాకు మామ్దానితో భేటీ కూడా ఒక కారణంగా ఉంది. అమెరికాలో ఆయన ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన నేతే. కానీ, భారత్‌పై ప్రధాని విషం చిమ్ముతూ, మోదీపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనపైనా మామ్దాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగస్టు 29న మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరగనున్న ఈవెంట్‌కు తన మద్దతు లేదని, అయితే ప్రైవేట్‌ని రద్దు చేసే అధికారం నగర పరిపాలనకు లేదని స్పష్టం చేశారు.

ఈవెంట్ నేపథ్యం
ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది వేడుకల సందర్భంగా గ్లోబల్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో భాగంగా భాగవత్‌ అమెరికా, కెనడా, యూకే పర్యటన. న్యూయార్క్‌లో యూనివర్సల్‌ ఒన్‌నెస్‌ సెలబ్రేషన్‌ పేరుతో దాదాపు 5 వేల మంది భారతీయ మూలాల ప్రజలతో సమావేశం జరగనుంది. ఆర్గనైజర్లు దీనిని ప్రపంచం ఒక కుటుంబం అనే సందేశంతో ఐక్యత, సామరస్యం, అంతర్‌ మత సంభాషణను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. భాగవత్‌ ఇప్పటికే అమెరికా చేరుకున్నారు.

మమ్దాని అభ్యంతరం..
న్యూయార్క్‌ సిటీ మొదటి ఇండియన్‌–అమెరికన్‌ మేయర్‌గా మమ్దాని తన వ్యతిరేకతను స్పష్టం చేశారు. ఆయన కుటుంబం నుంచి తెలుసుకున్న భారత్‌ చిత్రం బహుళత్వ, లౌకిక గణతంత్రంగా ఉందని, ప్రతీ వ్యక్తికి సమాన స్థానం ఉండాలని చెప్పారు. వివక్షతో కూడిన విజన్‌పై ఆధారపడిన ఉద్యమం ఎదుగుదల చాలా ఇబ్బందికరంగా లేదని, ఇది ఇండియన్‌–అమెరికన్‌గా తనతోపాటు ప్రతీ రంగు, మతం, విశ్వాసం ఉన్నవారికి చెందినదని నమ్మే నగర మేయర్‌గా కూడా వ్యతిరేకం అని అన్నారు. అయితే ప్రైవేట్ ఈవెంట్‌ను రద్దు చేసే అధికారం నగర పరిధిలో లేదని తెలుస్తోంది.

ఒకవైపు వ్యతిరేకత.. ఇంకోవైపు మద్దతు
ఇంటర్‌ఫెయిత్, సివిల్ రైట్స్‌ సంస్థ అయిన హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌, ఇండియన్‌ అమెరికన్‌ ముస్లిం కమ్‌ నేషనల్‌ ఈవెంట్‌ని వ్యతిరేకిస్తూ నగర హాల్‌ బయట నిరసనలు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను వివక్షాత్మక ఐడియాలజీగా చూస్తూ, మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ వేదికను రద్దు చేయాలని కోరుతున్నారు. మరోవైపు, ఆర్గనైజర్లు దీనిని సాంస్కృతిక, ఐక్యతా కార్యక్రమంగా వర్ణిస్తున్నారు. ఇక మరి కొందరు దానిని సాంస్కృతిక, జాతీయవాద ఉద్యమంగా చూస్తే, మైనారిటీలపై ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేస్తారు.

మామ్దాని వ్యాఖ్యలు భారతీయ అమెరికన్ సమాజంలోని భిన్న ధోరణులను, భారత్ లోపలి రాజకీయ చర్చలు విదేశాల్లో ఎలా ప్రతిధ్వనిస్తాయో చూపిస్తున్నాయి. ఈవెంట్ జరగనుంది. మమ్దాని అభ్యంతరం వ్యక్తం చేసినా, న్యాయపరమైన అధికారం లేకపోవడం వల్ల అది కొనసాగుతుంది. ఇది స్వేచ్ఛా వ్యక్తీకరణ, బహుళత్వం, ఐడియాలజీల మధ్య సంభాషణకు మరో ఉదాహరణగా నిలుస్తుంది.

You may also like

Leave a Comment

Notifications

5
Get instant updates as soon as articles are posted.
BRICS summit : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుతో భారత్ కు ఏంటి -RMK NEWS

BRICS summit : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 12 నుంచి…

2 hours ago
Shabad Rangareddy Incident: ఏడు ఇటుకలు.. ఆరుగురిని లేపేసాడు.. షాబాద్ ఉన్మాది తర్వాత టార్గెట్ ఎవరు...

Shabad Rangareddy Incident: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో షాబాద్ ప్రాంతంలో ఓ ఉన్మాది ఆరుగురుని చంపేశాడు. తన…

2 hours ago
Ganesh Laddu Auction: కోట్లు పెట్టి గణపతి లడ్డూ కొంటారు - RMK NEWS

గణేష్ లడ్డూ వేలం: రాజేంద్రనగర్ ప్రాంతంలోని కీర్తి రిచ్ మాండ్ విల్లాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసే గణపతికి విశేషమైన…

2 hours ago
అమ్మాయిల అంటే పిచ్చి.. సొంత కొడుకు ఉంగరం మింగిన -

దైవాలగూడ రాజ్ కుమార్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్…

2 hours ago
Hargila Bird : ఒక పక్షి కోసం మహిళ చేసిన పనికి మోడీ ఫిదా - RMK NEWS

Hargila Bird Conservation : కాలుష్యం పెరిగిపోతుంది. అడవులు తగ్గిపోతున్నాయి. అభివృద్ధి వేటుకు పచ్చటి చెట్లు నేల కూలిపోతున్నాయి.…

2 hours ago