విజయ్: విజయ్ విజయవాడ కు వచ్చారు. విజయవాడ ఉత్సవంలో ఉంది. దుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగులో మాట్లాడారు.. ప్రత్యేక విమానంలో మళ్లీ చెన్నై వెళ్లిపోయారు. ఈ పర్యటనలో చంద్రబాబుతో చాలాసేపు మాట్లాడారు. నదుల అనుసంధానం గురించి విజయవాడ ఉత్సవం వేదిక మీద విజయ్ ప్రకటన. ఇవి బయటకి కనిపిస్తున్న కోణాలు.. మరి లోపల ఏం జరిగాయి.. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. విజయ్ గురించి ప్రస్తావించలేదు.. విజయ్ గురించి కనీసం మాట కూడా మాట్లాడలేదు. కానీ ఏం జరిగింది.. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఎన్నికైన తర్వాత.. ఒక్కసారిగా మనసు ఎందుకు మార్చుకున్నారు.. చంద్రబాబు చెప్పగానే ఏపీకి వచ్చారు..
రాజకీయాలలో అవసరాలు మాత్రమే ఉంటాయి. ఆ అవసరాలు ప్రజల కోణంలో ఉంటాయి. నాయకుల కోణంలో కూడా ఉంటాయి. ఇప్పుడు ఏపీ నుంచి తెలుగు గంగ ద్వారా అదనపు నీళ్లు కావాలి. ఆ నీళ్లు వస్తేనే చెన్నై తాగు నీటి అవసరాలు తీరుతాయి. గత ప్రభుత్వాలు ఏపీతో ఈ విషయంలో పెద్దగా సంప్రదింపులు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు విజయ్ ఆ చొరవ తీసుకున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి కావేరీ లింకేజీ పక్కనే తెరమీదకి తీసుకొచ్చారు. దీనికి తమిళనాడు సపోర్ట్ చేయాలి. అలా చేస్తేనే కృష్ణ డెల్టా బాగుపడుతుంది. రాయలసీమకు నీళ్లు అందించే అవకాశం ఏర్పడుతుంది. దీని ద్వారా కర్ణాటకతో తమిళనాడుకు ప్రతి ఏడాది కావేరి నది జలాల విషయంలో జరుగుతున్న ఇబ్బంది తొలగిపోతుంది.
వాస్తవానికి తెర ముందు ఇవి కనిపిస్తున్నప్పటికీ.. తెర వెనుక చాలా జరిగినట్టు జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా తెలుస్తోంది. విజయ్ ఏపీ టూర్ కు నేషనల్ మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇచ్చింది. పైగా ఆ మధ్య ఒక నేషనల్ మీడియా నిర్వహించిన సర్వేలో విజయ్ దేశానికి కాబోయే ప్రధానమంత్రి జాబితాలో ఏకంగా టాప్ స్థానంలో నిలిచారు. ఒక దశలో రాహుల్ గాంధీని బీట్ చేసే అవకాశం ఉందని నేషనల్ మీడియా ప్రకటించింది. పైగా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దుర్గమ్మ గుడిలో ఆయన వ్యవహరించిన తీరు.. పీట వేసిన సరే కింద కూర్చున్న తత్వం.. అర్చకుడితో బొట్టు పెట్టుకున్న నేర్పరితనం ఇవన్నీ కూడా విజయ్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. దీనికి తోడు విజయ్ పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. తాజా రాష్ట్రానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తున్నారు. ఇది విజయ్ లో ఉన్న పరిపక్వతకు నిదర్శనమని కోయంబత్తూరు.. చెన్నై పత్రికలు వార్తలు వస్తున్నాయి..
వాస్తవానికి విజయ్ మీద నేషనల్ మీడియా గట్టిగా ఫోకస్ పెట్టడం.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలవడం.. పైగా తమిళనాడులో ద్రావిడ వాడకాన్ని పక్కనపెట్టి తనకంటూ సొంత ఇజం ఏర్పాటు చేసుకోవడం.. విజయ్ సాధించిన విజయాలు. ఏపీకి రాకముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో విజయ్ భేటీ అయ్యారు. అనేక విషయాల గురించి చర్చించారు. నరేంద్ర మోడీ చెన్నై వెళ్లినప్పుడు.. సాదరంగా ఆహ్వానించారు. కేంద్రం నుంచి తమకు రావలసిన డబ్బుల గురించి వేదిక మీద నుంచే మాట్లాడారు. ఇవన్నీ కూడా విజయ్ లో ఉన్న మరో కోణాన్ని చూపిస్తున్నాయి. నరేంద్ర మోడీతో భేటీ తర్వాత.. విజయ్ ఏపీలోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పైగా కాబోయే ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు తమిళనాడులో కొన్ని మీడియా సంస్థలు రాస్తున్నాయి. పీవీ నరసింహారావు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరూ ప్రధానమంత్రి కాలేదు. ఆ కోణంలో చూసిన విజయ్ సరే దక్షిణాది రాష్ట్రాల్లో తన మేనియా ప్రదర్శించాలని. అందువల్లే వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు.
తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి అదనపు నీళ్లు ఇస్తుందా.. జరగదా అనే పక్కన పెడితే.. ఇప్పటి కరువు కాలంలో రాష్ట్రం గురించి.. అందులోనూ చెన్నై నగరం గురించి చంద్రబాబుతో చర్చించడం.. కావేరి గోదావరి నదుల అనుసంధానం గురించి మాట్లాడటం.. విజయ్ పరిపక్వతకు నిదర్శనం. పైగా ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉంది. ఇటీవల ఓటు చోరీ అంశం గురించి రాహుల్ గాంధీ నోరు చించుకుంటున్నప్పటికీ విజయ్ మాట్లాడలేదు. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయ్ ఎన్ డి ఏ కూటమిలోకి వస్తారని.. ఆ సంకేతాలు ఇవేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. దేశ రాజకీయాల్లో మరో మలుపు అని చెప్పవచ్చు.. చంద్రబాబును కలిశాక విజయ్ విక్టరీ సింబల్ చూపించుకుంటూ చైన్నైవెల్లారు. ఇన్ డైరెక్ట్ గా తను ఏం చేశానో చెప్పారు.కొన్నిటికీ విశ్లేషణలు అవసరం లేదు. కేవలం ఇంటికేషన్స్ చాలు.